బిగ్ బాస్ 5 : అసలేం జరుగుతోందిరా ఇక్కడా !? సిరి, షణ్ముఖ్ కిస్ పై రచ్చ

‘బిగ్ బాస్ సీజన్ 5’ మంచి జోష్ లో సాగిపోతోంది. ప్రస్తుతం 11 వారం కొనసాగుతున్న షోలో కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతుంది. సిరి, యాని మాస్టర్, మానస్, ప్రియాంక కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్నట్లుగా తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తుంటే అర్థమవుతోంది. టాస్కుల సంగతి పక్కన పెడితే షో స్టార్టింగ్ నుంచి హౌజ్ లో నడుస్తున్న లవ్ ట్రాక్ ల విషయంపై బయట చర్చ ఎక్కువగా నడుస్తోంది. అయితే హౌజ్ లో ముందు నుంచీ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సిరి, షణ్ముఖ్ మధ్య అసలేం జరుగుతుందో మాత్రం అర్థం కావడం లేదు. వారిద్దరూ స్నేహితుల నుంచి ప్రేమికులుగా మారినట్టు అన్పిస్తోంది అనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Read Also : మోడీ వ్యవసాయ చట్టాల నిర్ణయంపై తాప్సి ట్వీట్

ఇద్దరూ ఊరికే అలగడలు, ఏడుపులు, బుజ్జగింపులు, హగ్గులు ప్రేక్షకులకు అలాగే కన్పిస్తున్నాయి మరి. తాజాగా విడుదలైన ప్రోమో చూశాక మాత్రం సిరి, షణ్ముఖ్ పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. బిగ్ బాస్ చరిత్రలోనే వరస్ట్ ఫ్రెండ్షిప్ అంటూ వీరిద్దరిపై ట్రోలర్లు విరుచుకు పడుతున్నారు. ఆ ప్రోమోలో సిరి, షణ్ముఖ్ కిస్ చేసుకున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో ఇది ఫ్యామిలీ చూసే షో అని మండిపడుతున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. వాళ్ళ అభిమానులు మాత్రం అది కిస్ కాదు, జస్ట్ హగ్ చేసుకున్నారు. వీడియోలో అలా కన్పిస్తోంది అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు సిరి, షన్ను కిస్ పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది.

Related Articles

Latest Articles