ఒక్క‌సారి రీచార్జ్ చేస్తే చాలు… ఎంత మైలేజ్ వ‌స్తుందో తెలాసా…!!

పెట్రోల్ ధ‌ర‌లు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌పై దృష్టిసారించారు వినియోగ‌దారులు.  ఎల‌క్ట్రిక్ బైకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నా, వాటిపై వ‌స్తున్న పలు రకాల విమ‌ర్శ‌ల కార‌ణంగా వెన‌క్కి తగ్గుతున్నారు.  ముఖ్యంగా మైలేజ్, బైక్ రూపం విష‌యంలోనే ఎక్కువ మంది వెన‌క్కి త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే.  దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రావ్‌ట‌న్ మోటార్స్ సంస్థ క్వాంటా అనే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను విపణిలోకి విడుదల చేసింది.  ఈ బైక్ బ్యాట‌రీని ఒక‌సారి రీచార్జ్ చేస్తే 120 కిలోమీర్ల‌దూరం ప్ర‌యాణం చేయ‌వ‌చ్చ‌ని కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Read: ఆ హీరోయిన్లతో రామ్… అనుకోకుండా కలిశారట..!

బైక్ గ‌రిష్టంగా 70 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణం చేస్తుంద‌ని, బ్యాట‌రీ చార్జ్ కావ‌డానికి మూడు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, రూ.80 తో 800 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేసే విధంగా బైక్ రూపొందించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి.  నెలకు 2000 బైక్‌ల‌ను ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం క‌లిగి ఉన్నామ‌ని, దీనిని 5000 యూనిట్ల‌కు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.  ఇక‌, ఈ బైక్ ధర 99,000గా నిర్ణయించారు.  ఇప్ప‌టికే ఆన్‌లైన్ ద్వారా బుకింగ్స్ ప్రారంభం అయ్యాయ‌ని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-