ఈ సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తుంది – చిన్మయి

ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో నటి అత్యాచార కేసు ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల క్రితం నటిని కారులో కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన కేసులో మలయాళ నటుడు దిలీప్ కుమార్ జైలుకి వెళ్లి బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇంకా ఈ కేసుపై మలయాళ హీరోయిన్లు అందరు తమ గొంతు ఎత్తి హీరోయిన్ కి సపోర్ట్ గా నిలిచారు. అందులో మలయాళ ప్రముఖ నటి పార్వతి తిరువొత్ ఒకరు. ఆ సమయంలో ఆమె మహిళా సంఘాలతో కలిసి ఆమె ఒక పోరాటాన్నే చేసింది. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది. ఈ విషయమై ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

ఆ పోరాటం వలన తనకు సినిమా అవకాశాలు తగ్గాయని, తాను నటించిన అన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి కానీ, ప్రస్తుతం నేను రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నిజాన్ని మాట్లాడినందుకు తనను, పోరాటంలో ఉన్నవారిని ఎలా బెదిరించారో కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ వార్తపై టాలీవుడ్ సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ” నిజం మాట్లాడినందుకు ఒక మంచి నటి అయిన పార్వతి తన పనిని కోల్పోయింది. ఆమెలాంటి నటి.. లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి తరుపున మాట్లాడం వలన ఆమె పనిని కోల్పోయిందని చెప్పడం వాస్తవం. చాలామంది మహిళలు మౌనంగా ఉన్నారు. రేపిస్టులను ప్రేమించే సమాజం మాత్రమే.. ” అంటూ ట్వీట్ చేసింది . ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles