ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్

హైదరాబాద్‌ నడిబొడ్డులోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజును ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందడంతో కలకలం రేగింది.. అయితే, బాలిక పక్కింట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లోనే మృతదేహమై కనిపించింది చిన్నారి.. దీంతో.. బాలిక తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆందోళనకు దిగారు.. నిందితుడు పరారీ కాగా.. వెంటనే పట్టుకుని ఎన్‌కౌంటర్‌ చేయాలని కూడా డిమాండ్‌ చేశారు.. చివరకు కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారుల హామీతో ఆందోళన విరమించారు. ఇక, యాదాద్రి భువనగిరి జిల్లాలో నిందితుడు రాజును అరెస్ట్‌ చేశారు పోలీసులు.. రాజు స్వగ్రామం అడ్డగూడురులో అతడిని అదుపులోకి.. హైదరాబాద్‌కు తరలించారు. తూర్పు మండలం డీసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి.. చివరకు నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు.. బాలికపై అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.

Related Articles

Latest Articles

-Advertisement-