జూలై 10న మొదలై… జూలై 10న ముగిసిన… స్టార్ హీరో సినిమా!

శింబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పొలిటికల్ డ్రామా మూవీ ‘మానాడు’. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా నిర్మాత సురేశ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే, మిగతా అన్ని చిత్రాల్లాగే శింబు, కళ్యాణి ప్రియదర్శన్ స్టారర్ ‘మానాడు’ కూడా అనేక వాయిదాలు పడింది గత సంవత్సర కాలంగా. లాక్ డౌన్ వల్ల శింబుకి అగచాట్లు తప్పలేదు. అయితే, 2020 జూలై 10న మొదలైన సినిమా 2021 జూలై 10న ముగిసింది! సేమ్ డేట్ తో ప్రారంభమై సేమ్ డేట్ తో ముగిసిందంటూ నిర్మాత ప్రత్యేకంగా ట్వీట్ కూడా చేశాడు!

‘మానాడు’ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా హీరో శింబు సెట్ మీద అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎక్స్ పెన్సివ్ వాచెస్ డైరెక్టర్ తో సహా అందరికీ గిఫ్ట్ ఇచ్చాడు. సినిమా పూర్తయ్యేందుకు తనకు ఎంతగానో సహకరించిన స్టార్ హీరోకి దర్శకుడు వెంకట్ ప్రభు సొషల్ మీడియాలో థాంక్స్ చెప్పాడు. చూడాలి మరి, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ‘మానాడు’ ఎప్పుడు జనం ముందుకి వస్తుందో! బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉండనుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-