చిన్నవయస్సులోనే డాక్టరేట్ అందుకున్న స్టార్ హీరో..

కోలీవుడ్ స్టార్ హీరో శింబు అరుదైన గౌరావాన్ని అందుకున్నాడు. తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ శింబును డాక్టరేట్ తో గౌరవించింది. అతి చిన్న వయస్సులో డాక్టరేట్ అందుకున్న వ్యక్తుల్లో శింబు ఒకదిగా మారిపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ” నాకు ఈ గౌరవాన్ని అందించిన వేల్స్ యూనివర్సిటీకి ధన్యవాదాలు.. ఈ గౌరావాన్ని నేను నా తల్లిదండ్రులకు అకింతమిస్తున్నాను. నాకు ఈ సినిమాను పరిచయం చేసి, ఇక్కడి వరకు తీసుకొచ్చింది వారే.. వారే లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అందుకే ఈ గౌరావాన్ని వారికే అంకితమిస్తున్నాను. నన్ను ఎంతగానో అభినందించే అభిమానులకు థాంక్స్” అని చెప్పారు. ఇక ఈ వేడుకలో శింబును.. అతని తల్లిదండ్రులు గర్వంతో ముద్దాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే శింబు ఇటీవలే మనాడు హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం ఆయన గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.

Related Articles

Latest Articles