ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే… గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర స్థిరంగా రూ. 44,200 కి చేరింది. కానీ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 10 తగ్గి రూ. 48,220 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే బంగారం ధ‌ర‌లు అలా ఉంటె వెండి ధ‌ర‌లు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ. 100 తగ్గి రూ. 63,600 వ‌ద్ద కొనసాగుతోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-