ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే…?

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి బాగా ఇష్టపడతారు. క‌రోనా కార‌ణంగా వివాహాలు పెద్దగా హ‌డావుడి లేకుండా సింపుల్‌గా జ‌రుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. క‌రోనా ప్రభావం బంగారం ధ‌ర‌ల‌పై స్పష్టంగా క‌నిపిస్తున్నది. గ‌త కొన్ని రోజులుగా ధ‌ర‌లు పెరుగుతున్నాయి. బంగారం ధ‌ర ఇప్పటికే రూ. 49 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధ‌ర రూ. 45,740 ఉండ‌గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 49,900 వ‌ద్ద ఉన్నది. బంగారం ధ‌ర‌లతో పాటుగా వెండి కూడా స్థిరంగా ఉంది. కిలో వెండి ధ‌ర 70,400కి చేరింది.

Related Articles

Latest Articles