విజ‌య‌ద‌శ‌మి ప్ర‌త్యేక‌త‌లు ఇవే…

విజ‌య‌ద‌శ‌మిని ద‌స‌రా అని పిలుస్తుంటారు.  శ‌ర‌న్న‌వరాత్రుల్లో చివ‌రి రోజును ద‌స‌రా పండుగ‌గా జ‌రుపుకుంటాం.  ద‌స‌రా రోజున బొమ్మ‌ల కొలువును పెడుతుంటారు.  నూత‌న వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు.  ఇక భాద్ర‌ప‌ద అమావాస్య రోజున ప్రారంభ‌మైన బ‌తుకమ్మ వేడుక‌లు ద‌స‌రా రోజున ముగుస్తాయి.  ద‌శ‌కంఠుడిని హ‌రించిన రోజు కూడా కావ‌డంతో ఆ రోజును విజ‌య‌ద‌శ‌మిగా జ‌రుపుకుంటారు.  ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ శుద్ధ దశమినాడు ద‌స‌రా పండుగ‌ను జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది.  ఆశ్వీయుజ మాసం శక్తిపూజకు ఎంతో ముఖ్యమని తంత్రశాస్త్రం ఉపదేశిస్తోంది. పూర్వం రాజులు, చక్రవర్తులు ఆశ్వీయుజ మాసంలోనే దిగ్విజయ యాత్రలకు వెళ్లేవారు.  తొమ్మిదిరోజుల‌పాటు శ‌క్తి స్వ‌రూపిణి అమ్మ‌వారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో పూజిస్తారు.  తొమ్మిదోరోజైన ద‌శ‌మి రోజున అమ్మ‌వారిని దుర్గాదేవిగా పూజిస్తారు.  

Read: తాలిబన్ల దెబ్బ… పాక్ విమానాలు నిలిపివేత…

-Advertisement-విజ‌య‌ద‌శ‌మి ప్ర‌త్యేక‌త‌లు ఇవే...

Related Articles

Latest Articles