బ్రేకింగ్: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను హైదరాబాద్‌లోని తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లోని సీఎస్ సోమేష్ కుమార్‌కు అందజేశారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది కలెక్టర్‌గా రిటైర్డ్ కానుండగా ఒక ఏడాది ముందే వెంకట్రామిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Read Also: రాముల‌వారి కంట క‌న్నీరు… ఆందోళ‌న‌లో భ‌క్తులు

మరోవైపు వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని సీఎం కేసీఆర్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీ పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల సిద్దిపేట కలెక్టర్ హోదాలో వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రైతులు వరి విత్తనాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపాయి.

Related Articles

Latest Articles