నన్ను స్టార్ చేసింది తెలుగు ప్రేక్షకులు : సిద్ధార్థ్

టాలీవుడ్ హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం ‘మహా సముద్రం’. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ఈ రోజు మహా సముద్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో సిద్ధార్థ్ మాట్లాడుతూ… బొమ్మరిల్లు సినిమాలో పాట పడుతూ తాను సిద్ధార్థ్ అంటూ పరిచయం చేసుకున్నాడు. అయితే తనకు తెలుగు అభిమానులకు మధ్య గ్యాప్ వచ్చినట్లు తాను కొన్ని మాటలను విన్నాను… కానీ అలాంటిది ఏమి లేదు అని చెప్పాడు. తనకు ప్రేక్షకుల మధ్య ఎప్పుడు గ్యాప్ రాదని చెప్పాడు. ఇక తనను ఓ స్టార్ చేసింది తెలుగు ప్రేక్షకులు అని అన్నాడు. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు అని.. ఆయన కారణంగానే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది అని అన్నారు. ఇక ఈ సినిమాలో పని చేసిన వారందరికీ ఇది ఒక్క మైలురాయిగా మిగిలిపోతుంది అని అన్నారు.

ఇక తనకు రావు రమేష్ అంటే చాలా ఇష్టం అని… ఆయన డైలాగ్ డెలివరీ అంటే ఇంకా చాలా అని అన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ అయిన అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ చాలా అద్భుతంగా నటించారు అని చెప్పారు. అయితే ఈ సినిమా తన దృష్టిలో మల్టీస్టారర్ సినిమా కాదని… ఇందులో కేవలం శర్వానంద్ మాత్రమే హీరో అని అన్నాడు. శర్వానంద్ వల్లనే ఏ సినిమా ఈ రేంజ్ లో ఉందని అన్నాడు. ఇక దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా గురించి అనుకున్న సమయం నుండి పట్టు వదలకుండా తాను అనుకున్న విధంగానే తీసాడు అని చెప్పిన సిద్ధార్థ్ మళ్ళీ తన అభిమానులకు తనను పరిచయం చేస్తునందుకు ధన్యవాదాలు తెలిపారు.

-Advertisement-నన్ను స్టార్ చేసింది తెలుగు ప్రేక్షకులు : సిద్ధార్థ్

Related Articles

Latest Articles