‘ఒరేయ్ బామ్మర్ది’ అదే ట్రైలర్ కదా!

సిద్ధార్థ్, జి.వి. ప్రకాశ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చయ్’. ఈ సినిమాను ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి డైరెక్ట్ చేశాడు. ఈ యాక్షన్ డ్రామా తమిళంలో 2019 సెప్టెంబర్ 6న విడుదలైంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత దీనిని ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో తెలుగులో డబ్ చేసి ఈ యేడాది ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 1 నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ను ఆహా సంస్థ విడుదల చేసింది. చిత్రం ఏమంటే… ఇదేమీ కొత్తగా కట్ చేసిన ట్రైలర్ కాదు! సినిమా విడుదల సమయంలో వచ్చిన ట్రైలరే!! దానినే మరోసారి జనం మీదకు వదిలారు. అంతే!! అయితే కథలో డీల్ చేసిన అంశమేమిటనేది ఈ ట్రైలర్ లో స్పష్టంగా ఉంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఆహాలో చూడొచ్చు. చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ ఇప్పుడు ‘ఒరేయ్ బామ్మర్ది’ తోనూ, వచ్చే నెలలో ‘మహా సముద్రం’తోనూ జనం ముందుకు వచ్చినట్టు అవుతోంది.

-Advertisement-'ఒరేయ్ బామ్మర్ది' అదే ట్రైలర్ కదా!

Related Articles

Latest Articles