డిసెంబర్ లో ‘శ్యామ్ సింగరాయ్’గా రాబోతున్న నాని!

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కొద్ది నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వి.ఎఫ్.ఎక్స్. కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండటం వల్ల నిర్మాణానంతర కార్యక్రమాలకు అధిక సమయం పడుతోందని రాహుల్ సాంకృత్యన్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన నాని, సాయిపల్లవి, కృతీశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దసరా సందర్భంగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీలోని నాని సెకండ్ డైమన్షన్ వాసు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. దీనికి మిక్కీ జే మేయర్ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. కాళీమాత నేపథ్యంలో ఉన్న నాని ఫోటో ఆకర్షణీయంగా ఉంది. ఎంతో పవర్ ఫుల్ గా ఉన్న ఈ పోస్టర్‌ నాని అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంది.

Read Also : అది సంస్కారం అంటే… బాలయ్యపై మోహన్ బాబు ప్రశంసలు

వాసు పాత్రలో నానీని ఎంతో ఇంటెన్సిటీని చూపించడంతో పోస్టర్‌పై అందరి దృష్టి పడింది. ఈ చిత్రంలో నాని బెంగాలీ కుర్రాడిగా శ్యామ్ సింఘరాయ్ పాత్రలో కనిపిస్తారు. అదే సమయంలో వాసుగా గుబురు గడ్డం, వెరైటీ హెయిర్ స్టైల్‌తో మెప్పించనున్నారు. అతని ప్రేమ, అతని వారసత్వం, అతని మాట అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కాబోతోందని ప్రకటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించగా, జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

-Advertisement-డిసెంబర్ లో 'శ్యామ్ సింగరాయ్'గా రాబోతున్న నాని!

Related Articles

Latest Articles