టీజర్ : రక్షించాల్సిన దేవుడే రాక్షసుడైతే… !

నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “శ్యామ్ సింగ రాయ్‌” టీజర్ తాజాగా విడుదలైంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ “శ్యామ్ సింగ రాయ్‌” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న మాస్ డ్రామాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా నాలుగు భాషల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ను విడుదల చేశారు. తెలుగులో నాని విడుదల చేయగా, తమిళంలో శివకార్తికేయన్, మలయాళంలో నజ్రియా, కన్నడలో రక్షిత్ శెట్టి చేతుల మీదుగా టీజర్ విడుదల అయ్యింది.

Read Also : ‘ఆర్ఆర్ఆర్’కు సమస్యగా మారనున్న ప్రభాస్

“అడిగే అండలేదు… కలబడే కండలేదని రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే కాగితే కడుపు చీల్చుకు పుట్టి, రాయడమే కాదు కాలరాయడం కూడా తెలుసనీ అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ‘శ్యామ్ సింగ రాయ్’ అంటూ హీరోను పరిచయం చేసిన తీరు, డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. అయితే లాస్ట్ లో వచ్చిన సన్నివేశాలను చూస్తూనే సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కినట్టు అన్పిస్తోంది.

Related Articles

Latest Articles