రేపు “శ్యామ్ సింగ రాయ్” టీజర్… అప్పుడే మొదలైన సందడి

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సందడి మొదలైంది. ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ నవంబర్ 18న గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉందంటూ తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో నాని అభిమానులు సోషల్ మీడియాలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాని డ్యూయల్ షేడ్‌లో కనిపించనుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో స్పెషల్ గా ‘శ్యామ్ సింగ రాయ్’ ట్రెండ్ అవ్వడం చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

Read Also : ‘జై భీమ్’ కాంట్రవర్సీపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్

మేకర్స్ ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ని విడుదల చేసి సినిమా కోసం ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోల్‌కతాలో 1970 సంవత్సరంలో జరిగే కథ నేపథ్యంలో జరుగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Image
Image
Image
Image

Related Articles

Latest Articles