రికార్డు ధరకు “శ్యామ్ సింగ రాయ్” డబ్బింగ్ రైట్స్

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. సాయి పల్లవి, కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్, జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. నాని ఫిల్మ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం “శ్యామ్ సింగ రాయ్” డబ్బింగ్ రైట్స్ డీల్ రికార్డు ధరకు క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను B4U దక్కించుకుంది. మరోవైపు ‘శ్యామ్ సింగ రాయ్’ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది.

Read Also : నాని సినిమా కాంట్రవర్సీపై పవన్ రియాక్షన్

నాని గత సినిమాల డీల్స్‌తో పోలిస్తే ఈ డీల్‌లు రికార్డు ధరలకు క్లోజ్ అయ్యాయి. ఇంతకుముందు సినిమాల కన్నా రెట్టింపు ధరలకు ఈ రైట్స్ అమ్ముడైనట్టు తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, ఇందులో ‘శ్యామ్ సింగ రాయ్‌’ పాత్రను నాని పోషిస్తున్నారు. సత్యదేవ్ జంగా రచించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. సను జాన్ వర్గీస్, నవీన్ నూలి వరుసగా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.

-Advertisement-రికార్డు ధరకు "శ్యామ్ సింగ రాయ్" డబ్బింగ్ రైట్స్

Related Articles

Latest Articles