‘శ్యామ్ సింగరాయ్’ ఓటీటీ అలెర్ట్..

న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలై భారీ విజయాన్ని అందుకొంది. ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ వలన కొన్ని చోట్ల కలెక్షన్లు తగ్గినా మరికొన్ని చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటిటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా జనవరి 21 న విడుదల కానుంది.ఈ మేరకు శ్యామ్ సింగరాయ్ పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి థియేటర్లో ఒక రేంజ్ లో మోత మోగించిన ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles