‘శుభ్ మంగళ్ సావధాన్’ కాంబో రిపీట్స్… బట్ విత్ ఏ ఛేంజ్!

బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు మాత్రమే కాదు. ఆయన నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంటాడు. ఆయుష్మాన్ ఖురానాతో ఆనంద్ ‘శుభ్ మంగళ్ సావధాన్’ చిత్రాల్ని నిర్మించాడు. వారిద్దరి కాంబినేషన్ లో ‘శుభ్ మంగళ్ సావధాన్’, ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ ప్రేక్షకుల్ని విజయవంతంగా అలరించాయి…

ఇప్పుడు మరోసారి నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్, ఆయుష్మాన్ ఖురానా కలసి పని చేయబోతున్నారట. అయితే, వీరిద్దరి మూడో చిత్రం ‘శుభ్ మంగళ్ సావధాన్’ ఫ్రాంఛైజ్ లోనిది కాదు. పూర్తిగా వేరే కథ, కథనంతో రాబోతోందట. ఆయుష్మాన్ ఖురానా క్యారెక్టర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని ముంబై టాక్. అతడ్ని పూర్తి స్థాయి కొత్త అవతారంలో ఫ్యాన్స్ చూడవచ్చని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఆనంద్, ఆయుష్మాన్ నెక్ట్స్ మూవీ చాలా వరకూ యూఎస్ఏలో షూటింగ్ జరుపుకోనుంది. అయితే, అంతకంటే ముందు ఆయుష్మాన్ ఖురానా ‘డాక్టర్ జీ’ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే నెలలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఆనంద్ ఎల్. రాయ్ మూవీ నవంబర్ లో మొదలవుతుందని సమాచారం.

ఆయుష్మాన్ తో సినిమాకి దర్శకుడిగా అనిరుధ్ అయ్యర్ గణపతి అనే కొత్త డైరెక్టర్ ని, ఆనంద్ ఎంపిక చేశాడట. అనిరుధ్ గతంలో ‘జీరో, తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’ లాంటి చిత్రాలకు సహాయకుడిగా పని చేశాడు. ఇక హీరోయిన్ పాత్ర కోసం ఓ బాలీవుడ్ టాప్ స్టార్ తో చర్చలు జరుపుతున్నట్టు టాక్. ఆమె ఎవరో ఇంకా క్లారిటీ రాలేదు…

చకచకా సినిమాలు పూర్తి చేసే టాలెంటెడ్ స్టార్ ఆయుష్మాన్ ‘ఛండీఘర్ కరే ఆషికీ’, ‘అనేక్’ సినిమాలు ముగించేశాడు. అవి రెండూ విడుదల కావాల్సి ఉంది. చూడాలి మరి, 2021 బిజీ బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ కి ఎలాంటి బాక్సాఫీస్ రిజల్ట్ తెచ్చిపెట్టనుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-