‘సలార్’లో శృతి హాసన్ పాత్ర ఇదే…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్యంలో విజయ్ కిరాగండూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ‘సలార్’ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసింది. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14 న థియేటర్లలో విడుదల కానుంది. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శృతి నటించబోయే పాత్ర గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం శృతి ఈ ‘సలార్’లో పొలిటికల్ జర్నలిస్ట్ పాత్రలో నటించనున్నారు. ఆమె పాత్ర ఒక ప్రముఖ టీవీ జర్నలిస్ట్ ఆధారంగా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే ఈ బ్యూటీ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తానని వెల్లడించారు. ఇక 2021లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది శృతి. ఈ ఏడాది మొదట్లో ‘క్రాక్’తో హిట్ కొట్టిన శృతి హాసన్… ఇటీవల విడుదలైన ‘వకీల్ సాబ్’తో మరో హిట్ ను సాధించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-