కమల్ ఓటమిపై స్పందించిన కూతురు శ్రుతి హాసన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు కోయంబత్తూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. కమల్ హాసన్ ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే ముందున్నప్పటికీ.. చివర్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ విజయం సాధించారు. కాగా కమల్ ఓటమి అనంతరం ఆయన కూతురు నటి శ్రుతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి ఫొటోను షేర్ చేసింది. ‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన తండ్రి ఫొటోను శ్రుతి హాసన్ షేర్ చేసింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-