బాలకృష్ణతో శ్రుతిహాసన్!?

‘క్రాక్’తో ఈ ఏడాది హిట్ కొట్టాడు దర్శకడు మలినేని గోపీచంద్. రవితేజ నటించిన ఈ సినిమా కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ కి మంచి ఊపును ఇచ్చింది. అందులో హీరోయిన్ శ్రుతిహాసన్. తన తాజా చిత్రం లోనూ శ్రుతిహాసన్ నే రిపీట్ చేయబోతున్నాడట మలినేని గోపీచంద్. ‘క్రాక్’ హిట్ తో ఏకంగా బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ పట్టేశాడు గోపి. మైత్రీమూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాను లాంఛనంగా అరంభించారు కూడా. ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ బాలకృష్ణ ఇమేజ్ కి సరిపోయేలా ఓ చరిత్రకారుని కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట. పల్నాటి ప్రాంతానికి చెందిన ఆ చరిత్రకారుని కథకి బాలయ్య నూటికి నూరు పాళ్లు యాప్ట్ అంటున్నారు. జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటితో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. జూలైకి ఈ సినిమా పూర్తి కానుంది. ఆ వెంటనే గోపీచంద్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట బాలకృష్ణ. బాలయ్య, శ్రుతిహాసన్ ఫస్ట్ కాంబినేషన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో మరి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-