బాలయ్యతో సినిమా కోసం శృతికి షాకింగ్ రెమ్యూనరేషన్

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నఈ చిత్రం ప్రారంభోత్సవం నవంబర్ 14న జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై “ఎన్‌బికె 107” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారు. బాలయ్య 107వ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం శృతి హాసన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Read Also : ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్

ఈ చిత్రం కోసం శృతి హాసన్ కు మేకర్స్ రెమ్యునరేషన్‌గా 2 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ శృతి నటించిన తెలుగు సినిమాల్లోకెల్లా ఇదే అత్యధిక పారితోషికం. గోపీచంద్ మలినేని శృతికి ‘క్రాక్‌’తో తెలుగులో మంచి రీఎంట్రీ హిట్ ను ఇచ్చాడు. ఈ చిత్రంలో కూడా ఆమె కోసం మరోసారి మంచి పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘జై బాలయ్య’ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమా యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతుండగా, వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

Related Articles

Latest Articles