నోరూరించే రొయ్యల కర్రీకి కేరాఫ్ అడ్రస్.. ఈ రెస్టారెంట్

సీ ఫుడ్ అంటే చాలా మంది లొట్టలేసుకుని తింటుంటారు. సీ ఫుడ్‌లో ప్రాన్స్ (రొయ్యలు) చాలా రుచిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఎంతోమంది ఇష్టపడి లాగించేస్తారు. అయితే హైదరాబాద్ నగరంలో రుచికరమైన రొయ్యల కర్రీ తినాలంటే ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసమే ‘shirmply’ రెస్టారెంట్ ప్రత్యేకంగా సిద్ధమైంది.

నోరూరించే రొయ్యల కర్రీకి కేరాఫ్ అడ్రస్.. ఈ రెస్టారెంట్

ఇప్పటికే నగరంలో పలు చోట్ల బ్రాంచీలు ఏర్పాటు చేసిన ‘shirmply’ రెస్టారెంట్ త్వరలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివసించే మదాపూర్‌లో బ్రాంచీని ప్రారంభించబోతోంది. అంతేకాకుండా త్వరలోనే సిటీ అంతటా తమ ఔట్‌లెట్లను విస్తరిస్తామని ‘shirmply’ రెస్టారెంట్ నిర్వాహకులు వెల్లడించారు. డొమెస్టిక్ మార్కెట్‌లో తమ వ్యాపార పరిధిని మరింత విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

నోరూరించే రొయ్యల కర్రీకి కేరాఫ్ అడ్రస్.. ఈ రెస్టారెంట్

ఈ నేపథ్యంలో ఆదివారం నాడు డెక్కన్ క్లబ్ అసోసియేషన్ సహకారంతో ‘shirmply’ రెస్టారెంట్ నిర్వాహకులు ప్రత్యేకంగా రొయ్యల కర్రీ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ చమన్ జిత్ సింగ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోహన్, నందకుమార్, శ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి, చెఫ్ సందీప్, చెఫ్ సత్య పాల్గొన్నారు.

నోరూరించే రొయ్యల కర్రీకి కేరాఫ్ అడ్రస్.. ఈ రెస్టారెంట్

‘shirmply’ రెస్టారెంట్ అందించే రొయ్యల కర్రీ రుచికరంగా ఉండటమే కాకుండా తక్కువ ఫ్యాట్, ఎక్కువ ప్రొటీన్‌లను అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. 100 కేలరీలు అందించే రొయ్యల కర్రీలో 23 శాతం ప్రొటీన్లు, 70 శాతం వాటర్, 5 శాతం విటమిన్లు, మినరల్స్‌తో పాటు విటమిన్ డి, బీ3, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం వంటివి ఉంటాయన్నారు. ఈ రెస్టారెంట్‌లో లభించే రుచికరమైన ప్రాన్స్ కర్రీ మిమ్మల్ని యంగ్‌గా ఉంచడమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధిపైనా పోరాడుతుందన్నారు.

నోరూరించే రొయ్యల కర్రీకి కేరాఫ్ అడ్రస్.. ఈ రెస్టారెంట్

Related Articles

Latest Articles