నయన్ ప్లేస్ లో శ్రద్ధా శ్రీనాథ్!?

కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార స్థానాన్ని శ్రద్ధా శ్రీనాథ్ కైవశం చేసుకుందట. అంటే నయన్ నెంబర్ వన్ ప్లేస్ ని కాదండోయ్! నయన్ నటించవలసిన సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటింబోతోందన్నమాట. అయితే దీనికి కారణం మాత్ర బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖానే. ఆయన సినిమాలో నటించే ఆవకాశం రావటంతో తమిళంలో తను కమిట్ అయిన సినిమాను వదిలేసింది నయన్. అంతే ఆ ప్లేస్ లోకి శ్రద్ధా వచ్చి చేరింది. ఇంతకు ముందు ‘పోడా పోడి’, ‘తెనాలిరామన్’, ‘ఎలి’ చిత్రాలను తీసిన యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో నయనతార నటించనుందనే వార్తలు వచ్చాయి.

అయితే నయన్ దయాళన్ సినిమాకు ఓకె చెప్పిన తర్వాత అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించే సినిమాలో నయన్ కి ఆఫర్ రావడంతో దయాళన్ సినిమా నుంచి తప్పుకుందట. షారుఖ్ చిత్రంలో నటించటానికి భారీ ఆఫర్ రావటంతో దానికి తగినట్లు నయన్ తన డేట్స్ ను ఎడ్జెస్ట్ చేయవలసి వచ్చింది. దాంతో దయాళన్ సినిమాను వదులుకోవలసి వచ్చింది. యువరాజ్ దయాళన్ సినిమా షూటింగ్ మొదలైంది కూడా. నయన్ లేని సీన్స్ ను కూడా తీశారు. నిజానికి నయన్ బాలీవుడ్ చిత్రాన్ని పూర్తి చేసే వరకు వేచిఉండాలనుకున్నారు.

అయితే షారూఖ్ కొడుకు అరెస్ట్ తో ఆ సినిమా షూటింగ్ అంతా పోస్ట్ పోన్ అయింది. దాంతో దయాళన్ చిత్రం నుండి నయన్ తప్పుకోవలసని పరిస్థితి ఎదురైంది. తప్పని పరిస్థితుల్లో దయాళన్ అండ్ టీమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ ని నయన్ ప్లేస్ లో రీప్లేస్ చేశారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ దే ప్రధాన పాత్ర. ఈ విషయాన్ని నిర్మాత ఎస్ఆర్ ప్రభు కూడా ధృవీకరించారు. మరి నయన్ సినిమాను పట్టేసిన శ్రద్ధా ఈ సినిమాతో అమ్మడి నెంబర్ వన్ స్థానంపై కూడా ఫోకస్ పెడుతుందేమో చూడాలి.

Related Articles

Latest Articles