బ్యాగ్స్ కొనమంటోన్న… ‘బాగీ’ బ్యూటీ!

బాలీవుడ్ లో సక్సెస్ రావటం కష్టం. వస్తే మాత్రం రెండు చేతులా రెండితలు సంపాదించుకోవచ్చు. అదే పని చేస్తోంది ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్. సినిమాల పరంగా ఈ ‘ఆశికీ’ అందాల రాశికి కొదవే లేదు. ఏజ్ 30 ప్లస్ అయినా మంచి డిమాండ్ సంపాదించుకుంది తన టాలెంట్ తో. శ్రద్ధా కపూర్ నెక్ట్స్ ‘నాగిన్’ అనే భారీ బడ్జెట్ ఫాంటసీ మూవీ చేయనుంది. అలాగే, ‘చాల్ బాజ్’ చిత్రంలోనూ ఆమే హీరోయిన్. రణబీర్ కపూర్, దర్శకుడు లవ్ రంజన్ సినిమాలోనూ శ్రద్ధా ఫీమేల్ లీడ్ గా బుక్కైంది! చేతి నిండా ఇన్ని చిత్రాలుండగా శ్రద్ధా కపూర్ కి కమర్షియల్ బ్రాండ్స్ కూడా చాలానే ఉన్నాయి. యాడ్స్ ద్వారా కోట్ల రూపాయల యాడెడ్ ఇన్ కమ్ వస్తోంది…

అవాంఛిత రోమాల్ని తొలగించే ప్రాడక్ట్ మొదలు గ్రీన్ టీ దాకా చాలా యాడ్స్ లో కనిపించే స్లిమ్ అండ్ సెక్సీ శ్రద్ధా ఇప్పుడు ఓ హ్యాండ్ బ్యాగ్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది. ఆల్రెడీ తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో ‘బ్యాగ్ఇట్’ బ్రాండ్ ను ఆమె ప్రమోట్ చేయటం మొదలు పెట్టింది. మైమరిపించే స్వచ్ఛమైన తెల్లటి టాప్ ధరించి ఈ గార్జియస్ బ్యూటీ గంభీరంగా కెమెరాకు ఫోజిచ్చింది. ‘బ్యాగ్ ఇట్ డాట్ కామ్’ నుంచీ ‘శ్రద్ధా కపూర్ లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్’ షాపింగ్ చేయమంటూ అమ్మాయిల్ని ఆహ్వానించింది!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-