షార్ట్ సర్క్యూట్ లో కాలిపోయిన ఇల్లు…

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పానుగంటి మాణిక్యం పెంకుటిల్లు లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెరిగాయి. ఈ ఘటన పై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేరు. అయితే ఈ మంటల్లో పెంకుటిల్లు కాగా నిత్యావసర వస్తువులు. ఎలాక్ట్రానిక్ సామాగ్రి, నగదు, బంగారు ఆభరణాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అయితే ఇంటి యజమానులు వస్తె గాని నష్టం విలువ అంచన వేయలేమంటున్నారు అధికారులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-