చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్థుడు అరెస్ట్…

చెన్నై లో కరుడుగట్టిన నేరస్థుడు పెరుమాళ్ అరెస్ట్ అయ్యాడు. చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడి వాటిని తన మొబైల్లో చిత్రీకరించారు పెరుమాళ్. ఐదుగురు చిన్నారులపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడి, తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు నిందితుడు పెరుమాళ్. నిందితునితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు చిన్నారుల తల్లులను సైతం అరెస్టు చేసారు చెన్నై పోలీసులు. బాధిత చిన్నారులను ప్రభుత్వ పరిశీలనా గృహానికి తరలించారు పోలీసులు. చెన్నై నగరంలో ఓ చిన్న చౌక దుకాణాన్ని నడుపుతున్నాడు పెరుమాళ్. అయితే గుట్కా విక్రయిస్తున్నాడన్న అనుమానంతో పెరుమాళ్ దుకాణంపై దాడి చేసిన పోలీసులు… కొన్ని ఆధారాల కోసం పెరుమాళ్ మొబైల్ ఫోన్ ను పరిశీలించగా చిన్నారులపై లైంగిక దాడి దృశ్యాలు బయటపడ్డాయి. పెరుమాళ్ మొబైల్ ఫోన్లో 50కి పైగా అశ్లీల దృశ్యాలు ఉండటంతో నివ్వెర పోయారు పోలీసులు.

Related Articles

Latest Articles

-Advertisement-