‘శేఖర్’లో శివాని రాజశేఖర్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 91వ సినిమా ‘శేఖర్’. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటించింది. ప్రామిసింగ్ థ్రిల్లర్‌లో ఆమె హీరో కూతురిగా నటించింది. రియల్ లైఫ్ తండ్రీకూతుళ్లు వెండితెర తండ్రీకూతుళ్లుగా నటించడం ఇదే తొలిసారి. తాజాగా ఈ స్టార్ తండ్రీకూతుళ్ళు కలిసి ఉన్న పిక్స్ ను మేకర్స్ విడుదల చేశారు. జీవితా రాజశేఖర్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాయడమే కాకుండా మెగాఫోన్ పట్టారు. బీరం సుధాకర రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గరం వెంకట శ్రీనివాస్‌లు పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ IPL, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Also : వైరల్ వీడియో : శ్రియా సీక్రెట్ కు ఏడాది !

ఈ ప్రాజెక్ట్ గురించి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ “రాజశేఖర్, శివాని కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. అవి సహజంగా వారి నిజజీవితంలో కనిపిస్తాయి. సన్నివేశాలు ఆర్గానిక్, పెర్ఫార్మెన్స్ సహజంగా ఉన్నాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ గ్లింప్స్, ‘లవ్ గంటే’ పాటకు భారీ స్పందన లభించింది. ఇతర అంశాలు కూడా సినిమాలో అత్యద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం” అని అన్నారు.


Related Articles

Latest Articles