కమల్ తో కార్తికేయన్.. కోలీవుడ్ లో బిగ్గెస్ట్ మూవీ

ఇటీవల ‘డాక్టర్’ సినిమాతో హిట్ ని అందుకున్న శివ కార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తున్న శివ కార్తికేయన్ తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్ట్ ఒకటి సంక్రాంతి పండగనాడు మొదలయ్యింది. శివ కార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నేడు అధికారికంగా ప్రకటించారు. ఇక ఏ సినిమాను విశ్వ నటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ విషయాన్ని శివ కార్తికేయన్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. “రెండు బలమైన శక్తులైన కమల్ హాసన్ గారు మరియు సోనీ పిక్చర్స్ తో కలిసినందుకు సంతోషిస్తున్నాను. ఇక ఇది జరగడానికి కారణమైన నా స్నేహితుడు దర్శకుడు రాజ్ కుమార్ కేపీ కి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో పాటు కమల్ హాసన్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కోలీవుడ్ లో అతిపెద్ద ప్రాజెక్ట్ లలో ఇది ఒకటని తెలుస్తోంది. డిఫరెంట్ కథాంశంతో ఈ సినిమాను తెరక్కించనున్నారట.

Related Articles

Latest Articles