శిల్పాశెట్టికి తనయుడి పవర్ ఫుల్ గిఫ్ట్… వీడియో వైరల్

సాగర కన్య శిల్పా శెట్టి తనయుడు వియాన్ రాజ్ కుంద్రా ఆమె కోసం ఒక పవర్ ఫుల్ వీడియోను అంకితం చేశాడు. మే 7న శిల్పా కుటుంబం… భర్త రాజ్ కుంద్రా, పిల్లలు సమీషా, వియాన్, ఆమె తల్లి , అత్తమామలకు కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలియజేశారు. ఆ తరువాత ఆమె కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకుంది. ప్రస్తుతం వారంతా కోలుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా వియాన్ డీప్ ఫేక్ ద్వారా తన తల్లిని బాలీవుడ్ సూపర్ వుమన్ ‘హేలా’లా మార్చేశాడు. అందులో శిల్పా కరోనా వైరస్ తో పోరాడుతోంది. ఈ వీడియోను శిల్పా తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మే 21న వియాన్ బర్త్ డే సందర్భంగా కుంద్రా దంపతులు ‘ట్రఫుల్’ అనే కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చారు.

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-