పరువు తీసిన ‘వాళ్లు’ పాతిక కోట్లు ఇవ్వాలంటోన్న మిసెస్ కుంద్రా!

శిల్పా శెట్టికి కోపం వచ్చింది. రాదా మరి? ఇష్టానుసారం వార్తలు రాస్తే ఎవరికైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అందుకే, కొన్ని మీడియా సంస్థలపై శిల్పా ఏకంగా 25 కోట్ల పరువు నష్టం దావా వేసింది! ఇంతకీ, కారణం ఏంటి అంటారా? ఆమె భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారమే!

సాధారణంగా ఒక సెలబ్రిటీ కానీ, వారి దగ్గరి వారుగానీ అరెస్ట్ అయితే పెద్ద రచ్చ అవుతూ ఉంటుంది. పైగా శిల్పా శెట్టి లాంటి గ్లామరస్ ఇమేజ్ ఉన్న బాలీవుడ్ బ్యూటీతో విషయం ముడిపడే సరికి ఈసారి ఇంకాస్త సంచలనం అయింది. అయితే, అన్నిటికంటే ముఖ్యంగా మిష్టర్ కుంద్రా న్యూడ్ వీడియోల విషయంలో వివాదంలో ఇరుక్కోవటం అందర్నీ షాక్ కు గురి చేసింది! కేసులో సెక్స్ యాంగిల్ కూడా ఉండటంతో మీడియాలో వార్తలు ఎడాపెడా వచ్చేశాయి! అదే శిల్పాకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది…

Read Also : రివ్యూ: తిమ్మరుసు

తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ కొన్ని మీడియా హౌజెస్ పై బాంబే హైకోర్ట్ ను ఆశ్రయించింది శిల్పా శెట్టి కుంద్రా. అబద్ధాల్ని కూడా నిజాలుగా ప్రచారం చేశారంటూ ఆమె ఆరోపించింది. తన భర్త నుంచీ తాను విడిపోయానని కూడా కొన్ని వార్తలొచ్చాయంటూ శిల్పా కోర్టుకు విన్నవించుకుంది. తక్షణం తప్పుడు వార్తల్ని ఆపే విధంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆమె అతి చేసిన సదరు మీడియా సంస్థలు తనకు సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. అంతే కాదు, తప్పుడు వార్తలు వండిన వారి నుంచీ 25 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది!

శిల్పా ఆరోపణలపై ప్రస్తుతం ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఆగస్ట్ 10 దాకా ఆమె భర్త రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండనున్నాడు.

-Advertisement-పరువు తీసిన 'వాళ్లు' పాతిక కోట్లు ఇవ్వాలంటోన్న మిసెస్ కుంద్రా!

Related Articles

Latest Articles