ప్రైమ్‌లో నెంబర్ వన్ గా ‘షేర్షా’

కార్గిల్ వార్ లో ఇండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా కరణ్‌ జోహార్ తెరకెక్కించిన సినిమా ‘షేర్షా’. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ పాత్ర పోషించిన ఈ వార్ డ్రామాకు ఆరంభం నుండే చక్కటి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల భారీ ఆదరణతో ఈ సినిమా ఇప్పటి వరకూ అమెజాన్ ప్రైమ్ లో మన దేశంలోనే ఎక్కువ మంది చూసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. నిర్మాత కరణ్ జోహార్ ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ, ‘ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసిన సినిమాగా మా ‘షేర్షా’ నిలవటం ఆనందంగాను గౌరవంగాను ఉంది.

Read Also : ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ ట్రైలర్

ఈ సినిమా ఇండియాలో 4,100 పట్టణాలలో ప్రసారం చేశారు. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలలో అందుబాటులో ఉంది. ఇది IMDB లోనూ 8.9 రేటింగ్‌తో ప్రజాదరణ పొందింది’ అన్నారు. కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ సినిమాకు విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. కైరా అద్వానీ కథానాయికగా నటించింది. ఇప్పటికీ ప్రైమ్ లో టాప్ మూవీస్ లిస్ట్ లో రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో రిప్రైజల్, మూడో ప్లేస్ లో హోమ్, నాలువ స్థానంలో ద రిథమ్ సెక్షన్, ఐదో ప్లేస్ లో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాలున్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-