రాజ ‘శేఖర్’ మూవీ దర్శకుడి మార్పు!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు. అరకు బోసు గూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారని ఓ మహిళ చెప్పే వాయిస్ ఓవ‌ర్‌తో ఫ‌స్ట్ గ్లింప్స్‌ మొదలైంది. ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే చేరుకున్నా… ఇన్వెస్టిగేషన్ చేయరు. కొన్ని రోజుల క్రితం రిజైన్ చేసిన శేఖర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ‘శేఖర్’గా రాజశేఖర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో డైలాగులు వినిపిస్తూ ఉంటే… స్ట‌యిలిష్‌గా సిగ‌రెట్ వెలిగిస్తూ రాజశేఖర్ స్క్రీన్ మీద కనిపించారు. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది.

Read Also : “లైగర్” దూకుడు… అప్డేట్స్ కోసం మేకర్స్ సన్నాహాలు

విశేషం ఏమంటే… ఈ సినిమా ప్రారంభంలో లలిత్ కుమార్ దర్శకుడు అని నిర్మాతలు ప్రకటించారు. కానీ షూటింగ్ పూర్తయ్యే సరికీ మెగా ఫోన్ జీవితా రాజశేఖర్ చేతిలోకి చేరింది. ఆమె ఈ సినిమాకు స్క్రీన్ ప్లేను సమకూర్చడంతో పాటు దర్శకత్వం చేశారని నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. ఇప్పుడు ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జనవరి 2022లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు. రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.

Related Articles

Latest Articles