‘లవ్ స్టోరీ’ రివ్యూ రాసుకుంటున్న శేఖర్ కమ్ముల !

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా కథలు ఎలా సాగుతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సున్నితమైన భావోద్వేగాలే ఆయన సినిమాలకు బలం. ఎంత నెమ్మదిగా చెప్పితే అంతా గట్టిగా హృదయాల్లో నిలుస్తాయనడానికి ఆయన సినిమాలే ఉదాహరణలు. అయితే కొన్నిసార్లు ఆ నిడివే సినిమాకు బలహీనతగా కూడా మారుతోంది. నిజానికి శేఖర్ కమ్ముల తన కథకు తగ్గట్టుగా సన్నివేశం ఎంత సమయం తీసుకోవాలనే దానిలో పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తారు. అయితే కాలక్రమములో, ఈ ఇంటర్ నెట్ ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. తీరిగ్గా కూర్చొని, ఒప్పిగ్గా సినిమాలను చూడ్డం ఓ వర్గ ప్రేక్షకులు మానేశారు. ఏదైనా సరే మూడు ముక్కల్లో చెప్పేయాలనే ధోరణికి అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఈ దర్శకుడు అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని, ఆయన చేస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రానికి మరోసారి ఎడిటింగ్ కు పనిచెప్పాడని తెలుస్తోంది.

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఎప్పుడో రావాల్సివుండగా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో శేఖర్ కమ్ముల ఎక్స్ పెరిమెంట్స్ కూడా పెరిగాయి. ఈ ఖాళీ కాలాన్ని ఆయన చాలా బాగా ఉపయోగించుకున్నాడు. ‘లవ్ స్టోరీ’ ని బెస్ట్ చిత్రంగా ఇచ్చేందుకు చాలా రకాల ప్రయోగాలే చేశాడని తెలుస్తోంది. త్వరలోనే సెన్సార్ బోర్డుకు వెళ్లనున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల మరోసారి కత్తెరకు పనిచెప్పాడట. సినిమాలో నిడివి ఎక్కువగా తీసుకొన్న కొన్ని సీన్స్ కు మెరుగులు దిద్దాడట. దీంతో సినిమా డ్యూరేషన్ మరింత తగ్గిందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఏ బలహీనతకు దావివ్వకుండా పర్ఫెక్ట్ ఔట్ ఫుట్ కోసం చాలానే కష్టపడ్డాడట. దీంతో చిత్రబృందం ‘లవ్ స్టోరీ’ పై చాలా నమ్మకంగా ఉన్నారు. వినాయకచవితి సందర్బంగా ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లోకి రాబోతోంది.

-Advertisement-‘లవ్ స్టోరీ’ రివ్యూ రాసుకుంటున్న శేఖర్ కమ్ముల !

Related Articles

Latest Articles