‘శ్యామ్ సింగరాయ్’ సాంగ్: నానితో ఏదో తెలియని లోకంలో విహరిస్తున్న కృతి

న్యాచురల్ స్టార్ నాని విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల అయన నటించిన ‘టక్ జగదీష్’ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో నాని ఆశలన్ని తన తదుపరి చిత్రం శ్యామ్ సింగరాయ్ పైనే పెట్టుకున్నాడు. టాక్సీ వాలా తో హిట్ దర్శకుడిగా మారిన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నుంచి విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా తాజాగా రెండో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఎదో ఎదో తెలియని లోకమా’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. కృష్ణ కాంత్ లిరిక్స్.. చైత్ర హస్కీ వాయిస్.. మిక్కీ జే మేయర్ సంగీతం మెస్మరైజ్ చేశాయి.

ప్రేమించినవాడి పక్కన ఉంటే ప్రేయసి ఎలాంటి అనుభూతి చెందుతుందో, ఆమె మనుసులోని భావాలను చూపించారు. ఇక వీడియోలో నాని, కృతి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా కనిపించింది. చివర్లో కృతి- నాని మధ్య లిప్ లాక్ సాంగ్ హైలైట్ గా మారింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నాని హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Latest Articles