క్రేజీ ప్రాజెక్ట్ లో నితిన్ స్థానంలో శర్వానంద్ ?

యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ “పవర్ పేట” ఆగిపోయిందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రూపొందాల్సి ఉండగా… ఇందులో నుంచి నితిన్ బయటకు వెళ్లిపోయాడని, ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ప్రతిపాదించడం, అందుకు చాలా టైం పడుతుందన్న ఉద్దేశ్యంతోనే నితిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రం కోసం శర్వానంద్‌ను సంప్రదించారట. శర్వా త్వరలోనే ఈ చిత్రానికి తన ఆమోదం తెలిపే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. “పవర్ పేట” రెండు భాగాలుగా తెరకెక్కనుండగా… దీని కథ 1960-2021 ఉండనుందట. ఇందులో శర్వానంద్ 3 పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకటి 18 ఏళ్ల టీనేజ్, రెండవది 40 ఏళ్ల వ్యక్తి, మూడవది 60 సంవత్సరాల ముసలివాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. కాగా ప్రస్తుతం శర్వానంద్ “మహాసముద్రం”, “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-