రైతులు మరణిస్తున్న కేసీఆర్‌కు సోయి లేదు: షర్మిల

తెలంగాణ రైతులు మరణిస్తున్న కేసీఆర్‌కు సోయి లేదని షర్మిల నిప్పులు చెరిగారు. ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు మరణిస్తున్నా కేసీఆర్‌ సర్కార్‌ ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయింది. చివరి గింజ వరకు కొంటానన్నది ఊసే లేకుండా పోయిందంటూ ధ్వజమెత్తారు. పెట్టుబడి రాక రైతులు చస్తా ఉంటే మీరు సంబరాలు చేసుకొంటున్నారు.

Read Also: తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉంది : తమ్మినేని వీరభద్రం

ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి అని రైతుల మీద ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారు. కానీ కేంద్రం మెడలు వంచుతామంటే నమ్మాలా? మొన్నటివరకు మీ మెడ మీద కత్తి పెట్టి వడ్లు కొనబోమని రాయించుకొన్నారు అన్న వాళ్ళ మెడలు ఈ రోజు మీరు వంచుతారా ? ఎందుకు మీ రాజకీయ డ్రామాలు? అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. మీ అధికారం కోసం, మీ కుర్చీ కోసం మీరు ఆడుతున్న నాటకాలలో ఇదే ఒక భాగమే తప్ప మీకు రైతుల మీద ప్రేమ లేదు. రైతుల చావుల మీద సోయి లేదు. అంటూ షర్మిల ట్విట్టర్‌ వేదిగకగా కేసీఆర్‌ సర్కార్‌ను నిలదీశారు.

Related Articles

Latest Articles