ఈట‌ల‌కు ష‌ర్మిల ఆహ్వ‌నం… పార్టీలోకి వ‌స్తానంటే…

వైఎస్ ష‌ర్మిల కొత్త‌పార్టీని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.  కొత్త వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీని పెట్ట‌బోతున్నారు.  కాగా ఈరోజు ష‌ర్మిల కొత్త పార్టీ గురించి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి కొన్ని విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు.  కేసుల‌కు భ‌య‌ప‌డి ఈట‌ల రాజెంద‌ర్ బీజేపీలో చేరుతున్నార‌నీ, టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారిపై కేసులు పెట్ట‌డం కామ‌న్ అయింద‌ని అన్నారు.  ఈట‌ల త‌మ పార్టీలోకి వ‌స్తామంటే త‌ప్ప‌కుండా ఆహ్వ‌నిస్తామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల‌తో ఈ విష‌యంపై చర్చించ‌లేద‌ని అన్నారు.  జులై 8 వ తేదీన వైఎస్ఆర్ పుట్టిన రోజున పార్టీని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు.  పార్టీ జెండా అజెండా అన్నింటిని అదే రోజున ష‌ర్మిల ప్ర‌క‌టించ‌నున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-