నితిన్ గ‌డ్కారిపై శ‌ర‌ద్ ప‌వార్ ప్ర‌శంస‌లు… అధికారం ఉంటే…

చేతిలో అధికారం ఉండి అభివృద్ధి చేయాలనే బ‌ల‌మైన కోరిక ఉంటే దేశాన్ని అభివృద్ధి ప‌దంలో న‌డిపించ‌వ‌చ్చ‌ని నితిన్ గ‌డ్కారి నిరూపించార‌ని ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ పేర్కొన్నారు.  ఈరోజు అహ్మ‌ద్ న‌గ‌ర్‌లోని ఓ కార్య‌క్ర‌మంలో నితిన్ గ‌డ్కారీతో క‌లిసి వేదిక‌ను పంచుకున్న శ‌ర‌ద్ ప‌వార్ ఈ విధ‌మైన వ్యాఖ్య‌లు చేశారు.  అహ్మ‌ద్ న‌గ‌ర్‌లో సుదీర్ఘ‌కాలంగా అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి.  వాటిని నితిన్ గ‌డ్కారి ఈరోజు ప్రారంభించ‌బోతున్నార‌ని తెలిసి అక్క‌డికి వ‌చ్చాన‌ని అన్నారు.  నితిన్ గ‌డ్కారి ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టే నాటికి ఈ ప్రాంతంలో 5 వేల కిలోమీట‌ర్ల మేర రోడ్లు ఉన్నాయ‌ని, ఆయ‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఆ రోడ్లు ఇప్పుడు 12 వేల కిలోమీట‌ర్ల‌కు పెరిగాయ‌ని, చేతిలో అధికారం ఉండి ప‌నులు చేయాల‌ని, అభివృద్ధి చేశాల‌నే సంక‌ల్పం ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంద‌ని, దానికి నితిన్ గ‌డ్కారి ఒక ఉదాహ‌ర‌ణ అని చెప్పారు.  

Read: బీహార్‌లో బాబాయ్ అబ్బాయ్‌ల‌కు ఈసీ షాక్‌…

-Advertisement-నితిన్ గ‌డ్కారిపై శ‌ర‌ద్ ప‌వార్ ప్ర‌శంస‌లు... అధికారం ఉంటే...

Related Articles

Latest Articles