బిగ్ బాస్ 5 : దీప్తితో షన్ను పెళ్ళికి తల్లిదండ్రుల కండిషన్

యూట్యూబ్ తో పాపులర్ అయిన షణ్ముఖ్, దీప్తి సునైనా ఇద్దరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అన్న విషయం తెలిసిందే. గత సీజన్ లో దీప్తి పార్టిసిపేట్ చేయగా, తాజా సీజన్ లో షణ్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా ఉన్నాడు. అయితే ఇంతకుముందు దీప్తి, సునయన ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ కు వచ్చాక షణ్ముఖ్ ఆ వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి లవ్ స్టోరీ ఓపెన్ సీక్రెట్. ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచి షణ్ముఖ్ ప్రతి నిమిషం దీప్తి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాడు.

Read Also : “పుష్ప”రాజ్ కు హిందీ డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?

రీసెంట్‌గా బిగ్ బాస్ మేకర్స్ దీప్తి సునైనాను వీకెండ్ ఎపిసోడ్‌కి తీసుకొచ్చి షన్నును ఎమోషనల్‌గా మార్చారు. అయితే షణ్ముఖ్ తల్లిదండ్రులు మాత్రం తమకు ఈ ప్రేమకథ గురించి తెలియదని, షణ్ను టెలివిజన్‌లో అధికారికంగా ప్రకటించడంతోనే అసలు విషయం తెలిసిందని సమాచారం. ఇటీవల ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షన్ను తల్లిదండ్రులు మాట్లాడుతూ “దీప్తిని ప్రేమిస్తున్నానని షన్ను మాకు చెప్పలేదు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ వీడియోలు చేసి పాపులర్ అయ్యారు. వాళ్లను ఎప్పుడూ మంచి స్నేహితులుగానే భావించేవాళ్లం. కానీ టెలివిజన్‌లో వారి టాటూలు, ప్రకటనలను చూసిన తర్వాత వారి ప్రేమ కథ గురించి మాకు తెలిసింది. షణ్ముఖ్ దీప్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే దీప్తి తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది. దీప్తి తల్లితండ్రులకు ఒప్పుకోకపోతే మేం వారికి పెళ్లి చేయము’ అని వారు తెలిపారు. కాగా షన్ను అన్నయ్య సంపత్ ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి షణ్ముఖ్ పెళ్లికి 3-4 సంవత్సరాలు పడుతుందని వారు క్లారిటీ ఇచ్చారు.

Related Articles

Latest Articles