సన్నీ – షణ్ణు మధ్య ఏర్పడిన బ్రిడ్జ్!

బిగ్ బాస్ సీజన్ 5లో ఎప్పుడు, ఎవరు, ఎవరితో మింగిల్ అవుతున్నారో తెలియకుండా ఉంది. కెప్టెన్సీ టాస్క్ ‘నీ ఇల్లు బంగారం కాను’లో పోటీ కంటే కూడా చర్చోపచర్చలు ఎక్కువగా జరిగాయి. గార్డెన్ ఏరియాలోని గోల్డ్ మైన్ నుండి బంగారు ముత్యాలు ఏరుకోవడం, వాటిని భద్రంగా దాచిపెట్టుకోవడం రెండూ కూడా కొంత ఇబ్బందినే కలిగిస్తున్నాయి. దాంతో ఎవరికి వారు అవకాశం చిక్కాలే కానీ దొంగలుగా మారిపోతున్నారు.

Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న నాని

ఇంకా చిత్రం ఏమంటే… ఆర్జే కాజల్ ఏకంగా ఎవరూ లేనప్పుడు గోల్డ్ మైన్ నుండే బంగారు ముత్యాలను దొంగిలించింది. అందుకు బిగ్ బాస్ అనుమతి కోరుతూ కెమెరా ముందు తన అభిప్రాయం చెప్పింది. అలా అర్థరాత్రి మూడు గోల్డ్ పెరల్స్ దొంగిలించిన కాజల్, ఆ తర్వాత వాటిని తిరిగి అందులోనే వేసేసింది. ఇక ఈ టాస్క్ లో రెండో రోజు స్పెషల్ పవర్ ను అందుకున్న శ్రీరామ్ తెలివిగా రవి దగ్గర ఉన్న గోల్డ్ పెరల్స్ ను తీసుకుని, ఆ పవర్ ను రవికి బదలాయించాడు. తీరా చూస్తే, ఆ పవర్ ఎవరైతే వినియోగించుకోవాలని అనుకుంటారో, వారు తమ దగ్గర ఉన్న గోల్డ్ పెరల్స్ నుండి సగం స్టోర్ రూమ్ లో పెట్టాలి. అయితే ఆ పవర్ తీసుకునే సమయానికి రవి దగ్గర ఏమీ లేకపోవడంతో అతను కొత్తగా కోల్పోయిందేమీ లేకపోయింది. అయితే ఇది కరెక్ట్ కాదని, శ్రీరామ్ మాత్రమే ఆ పవర్ ను యూజ్ చేయాలని మానస్ చెప్పాడు. బట్ మెజారిటీ ఇంటి సభ్యులు అతనితో ఏకీభవించలేదు. ఒకవేళ అది తప్పు అయితే బిగ్ బాస్ చెబుతాడు కదా! అని వదిలేశారు. దీనికి ముందు మాత్రం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.

సన్నీకి బిగ్ బాస్ ఎవరి దగ్గర నుండైనా సగం గోల్డ్ పెరల్స్ తీసేసుకుని తనకు నచ్చిన వారికి ఇచ్చే పవర్ ఇచ్చాడు. అప్పటికే ప్రియాంక, మానస్ మొదటి రెండో స్థానాలలో ఉండటంతో సిరి – మానస్ కు మధ్య టై కాకుండా, ఆమె దగ్గర ఉన్న సగం పెరల్స్ ను సన్నీ షణ్ముఖ్ కు ఇచ్చాడు. ఆ రకంగా మానస్ ను సేవ్ చేశాడు, షణ్ణుకు ఛాన్స్ ఇచ్చాడు. దాంతో సన్నీ, షణ్ముఖ్ మధ్య ఓ అనురాగ బంధం ఏర్పడినట్టు అయ్యింది. తనకు సాయం చేసిన సన్నీకి, తప్పకుండా తానూ సాయం చేస్తానని షణ్ముఖ్ ఈ సందర్భంగా మాట ఇచ్చాడు. సో… 72, 73 రోజులలో జరిగిన ఆట చూస్తే… నిదానంగా సిరి, షణ్ణు వైపు మానస్ అండ్ సన్నీ వస్తున్నట్టుగా అనిపిస్తోంది.

Related Articles

Latest Articles