తల్లి కుమారుడిని బలిగొన్న కరోనా.. పోరాడుతున్న సోదరి

నెల వ్యవధిలో కరోనా మహమ్మారితో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోదరి మృత్యువుతో హాస్పిటల్ లో పోరాడుతుంది. తోండుపల్లి గ్రామానికి చెందిన పెదిరిపాటి సుభాష్ గౌడ్ (50) చంద్రిక దంపతులకు ఏప్రిల్ 28న, 25వ వివాహ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే అప్పటికే సుభాష్ గౌడ్ తో పాటు అయన భార్య చంద్రిక, కుమారుడు, తల్లి సోదరికి కరోనా సోకింది. సాధారణ జ్వరం అనుకుని నిర్లక్ష్యం చేశారు. మే 1న సుభాష్ గౌడ్ తల్లి సులోన (70) ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో సమీపంలోని అస్పటల్ కు తరలించారు. దీంతో చికిత్స పొందుతూ మే 12న మృతి చెందింది. అప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుభాష్ గౌడ్ తల్లి అంతక్రియల్లో పాల్గోన్నాడు. మరుసటిరోజు పరిస్థితి విషమించడంతో అస్పటల్ కు తరలించగా 25 రోజులు కోవిడ్ తో పోరాడి మృతి చెందాడు. వైద్య ఖర్చుల కోసం దాదాపు 31 లక్షలు కర్చు చేసిన ఫలితం లేదు. ప్రస్తుతం సుభాష్ గౌడ్ సోదరి ఒ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పోందుతుంది. సుభాష్ గౌడ్ భార్య ఇంటివద్దనే ఉండి కరోనాను జయించగా కుమారుడును వారం రోజులు హాస్పిటల్ లో ఉండి కోలుకున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-