డబ్బులిస్తే ఏదైనా చేసే ‘ఫ్రీలాన్స్ టెర్రరిస్టు’తో… ‘పఠాన్’ పోరాటం!

బాలీవుడ్ లో ఇప్పుడు ‘పఠాన్’ చర్చ జోరుగా సాగుతోంది. కొంత గ్యాప్ తరువాత షారుఖ్ ఖాన్ మళ్లీ పెద్ద తెరపై కనిపించబోతున్నాడు. అంతే కాదు, సక్సెస్ ఫుల్ జోడీ దీపికా, ఎస్ఆర్కే కూడా తమ మ్యాజిక్ ఇంకోసారి రిపీట్ చేయబోతున్నారు.

‘పఠాన్’ సినిమా గురించి బాలీవుడ్ లో జరుగుతోన్న చర్చలో జాన్ అబ్రహాం పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన ఈ ఎస్పీనాజ్ థ్రిల్లర్ లో ‘ఫ్రీలాన్స్ టెర్రరిస్టు’గా నటిస్తున్నాడట! ఫ్రీలాన్స్ అంటే వినటానికే వింతగా ఉంది కదా! కానీ, ‘పఠాన్’లో షారుఖ్, దీపిక రా ఏజెంట్స్ కాగా విలన్ జాన్ అబ్రహాం రష్యన్ మాఫియా కోసం పని చేసే కిరాయి ఉగ్రవాది! అంటే, ఆయనకి ఎవరు డబ్బులిస్తే వారి తరుఫున పని చేస్తాడన్నమాట. ‘పఠాన్’ సినిమా విలన్ కి ఎలాంటి జాతీయత, సెంటిమెంట్స్, సిద్ధాంతాలు ఉండవట!

‘పఠాన్’లో హీరో, విలన్ ఇద్దరూ సన్నగా కనిపిస్తారని కూడా బీ-టౌన్ లో ప్రచారం సాగుతోంది. మొదట జాన్ ని భారీగా కండలు తిరిగిన కర్కోటకుడిగా చూపిద్దామని మేకర్స్ భావించారట. కానీ, చివరకు వద్దనుకుని షారుఖ్ లాగే జాన్ అబ్రహాంని కూడా సన్నగా కెమెరా ముందుకు తెచ్చారట. ఆ లుక్ కోసం బాలీవుడ్ అందగాడు బాగానే కష్టపడి ఒళ్లు తగ్గించాడని చెబుతున్నారు. కింగ్ ఖాన్ కూడా పెరుగుతోన్న తన ఏజ్ కి విరుద్ధంగా యంగ్ గా, లీన్ గా కనిపిస్తాడట!

ఇప్పటికే ‘టైగర్’గా రా ఏజెంట్ పాత్రలో జనాలకి దగ్గరైన సల్మాన్ ఖాన్ ‘పఠాన్’లో అతిథిగా రాబోతున్నాడు. రష్యన్ మాఫియా నుంచీ షారుఖ్ ని కాపాడే డేరింగ్ అండ్ డెడ్లీ సీక్రెట్ ఏజెంట్ గా ఆయన అలరిస్తాడని అంటున్నారు. చూడాలి మరి, 2022 ఈద్ సందర్భంగా థియేటర్స్ కు వచ్చే ‘పఠాన్’ ఎలాంటి రికార్డులు నెలకొల్పుతుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-