షారూఖ్ డిజిటల్ ఎంట్రి కన్ ఫామ్…

డిస్నీ హాట్ స్టార్ లో వెబ్ సీరీస్

మారిన కాలానికి అనుగుణంగా మన తారలు కూడా మారుతున్నారు. బడా స్టార్స్ సైతం డిజిటల్ బాట పడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ డిజిటల్ ఎంట్రీనే అందుకు తార్కాణం. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా పూర్తి చేసి అట్లీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న షారూఖ్ ‘రాకెట్రీ, బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్రలలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే షారూఖ్‌ డిజిటల్ ఎంట్రీకి సై అనేశాడు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ నిర్మించబోయే వెబ్ సీరీస్ లో నటించటానికి పచ్చజెండా ఊపేశాడు. ఇదే విషయాన్ని డిస్నీ అధికారికంగా కూడ ప్రకటించింది. షారూఖ్ లాంటి సూపర్ స్టార్ త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడంటూ తమ కోసం వెబ్ సీరీస్ సైన్ చేశాడని గర్వంగా చెప్పుకుంటోంది. ఇక తెలుగునాట డిస్నీకి ప్రమోటర్ గా సూపర్ స్టార్ మహేశ్ వ్యవరిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ డీల్ లో మహేశ్ కి దాదాపు 3 కోట్లు ముట్టచెప్పనున్నట్లు వినిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రచారానికి పరిమితమైన మహేశ్ డిజిటల్ ఎంట్రీకి సై అంటే కోట్లకు కోట్లు ఇవ్వటానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సిద్ధంగా ఉంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి మహేశ్ సై అంటాడా? చూద్దాం అదెప్పుడు జరుగుతుందో.

షారూఖ్ డిజిటల్ ఎంట్రి కన్ ఫామ్…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-