బన్సాలీతో మరోసారి షారూఖ్

2002లో సంజయ్ లీలా బన్సాలీ ‘దేవదాస్’లో నటించాడు. ఆ తర్వాత ఇన్నేళ్ళకు మరోసారి వీరిద్దరూ కలసి పనిచేయబోతున్నారట. 2018లో విడుదలైన ‘జీరో’ తర్వాత ఇప్పటి వరకూ షారూఖ్ సినిమా ఏది విడుదల కాలేదు. షారూఖ్ నటిస్తున్న ‘పఠాన్’ షూటింగ్ దశలో ఉంది. ఇది వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. అయితే ‘రాకెట్రీ, బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా’లో క్యామియో రోల్స్ లో నటిస్తున్నాడు షారూఖ్. తాజాగా సంజయ్ లీలా బన్సాలీ సినిమా కమిట్ అయినట్లు వార్తలు వినవస్తున్నాయి. ప్రేమకథగా తెరకెక్కే ఈ సినిమాకి ‘ఇజార్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. పూర్తి స్క్రిప్ట్ విన్న షారూఖ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. సందేశాత్మకంగా ఉండే రొమాంటిక్ సినిమా అట. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో!?

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-