షారుఖ్ కుమారుడి వాట్సాప్‌ చాట్‌లో షాకింగ్ విషయాలు!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్, రేవ్ పార్టీ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో జరుగుతున్న రేవ్‌ పార్టీపై రెయిడ్ చేసిన అధికారులు ఆర్యన్‌ సహా మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఆర్యన్ ఖాన్ ని కేవలం విచారణ కోసం మాత్రమే అదుపులోకి తీసుకున్నామని.. అతడిపై ఇంకా ఎలాంటి ఆరోపణలు, కేసు నమోదు కాలేదని ఎన్సీబీ అధికారులు అంటున్నారు. కాగా, విచారణ సందర్భంగా ఎన్సీబీ అధికారులు ఆర్యన్ వాట్సాప్ చాట్‌, కాల్స్ డాటాను పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం, ఆర్యన్ తరచూ డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చేవాడని తెలుస్తోంది. ఇక షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్‌ లో సంచలనం సృష్టిస్తోంది.

-Advertisement-షారుఖ్ కుమారుడి వాట్సాప్‌ చాట్‌లో షాకింగ్ విషయాలు!

Related Articles

Latest Articles