వీడియో : అల్లు అర్హకు “శాకుంతలం” టీం బర్త్ డే విషెస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హకు “శాకుంతలం” టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘శాకుంతలం’ షూటింగ్ సమయంలో అల్లు అర్హ చేసిన అల్లరిని మరింత క్యూట్ గా చూపించారు.

Read Also : కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తాజా పాన్ ఇండియా పౌరాణిక చిత్రం “శాకుంతలం”. సమంత “శకుంతల”గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. దుష్యంతుడి పాత్రలో హీరో దేవ్ మోహన్‌ కనిపించనున్నాడు. గుణశేఖర్ నేతృత్వంలోని పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనిని స్టార్ట్ చేశారు. విజువల్, గ్రాఫిక్స్ సినిమాలో మేజర్ పార్ట్. కెనడా, హాంకాంగ్, చైనాలకు చెందిన టాలెంటెడ్ నిపుణులు విజువలైజేషన్ సరిగ్గా రూపొందించడానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ 10 నెలల కన్నా ఎక్కువ ఉండవచ్చని వెల్లడించాడు. 2022 ప్రారంభంలో “శాకుంతలం” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related Articles

Latest Articles