ఏపీలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు…

ఏపీలో ముఖ్యంగా కడపలో భారీ భార్షలు కురుస్తున్న విషయం తెలిసిందే. దాంతో అక్కడ ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అయితే రేపు ఆ జిల్లా మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేయగా…పలు రైళ్లు దారి మళ్లించారు. చెన్నై, తిరుపతి నుండి కడప మీదుగా నడిచే రైళ్లు రేపు రద్దు చేసారు. రేణిగుంట -గుంతకల్లు, గుంతకల్లు -రేణిగుంట మధ్య నడిచే ప్యాసింజర్ రైలు.. కడప -విశాఖపట్నం, విశాఖపట్నం -కడప మధ్య నడిచే తిరుమల ఎక్స్ ప్రెస్ రైలు… ఔరంగబాద్- రేణిగుంట, చెన్నై- లోకమాన్య తిలక్, చెన్నై- అహ్మదాబాద్, మదురై- లోకమాన్య తిలక్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసారు అధికారులు. అలాగే వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్ ప్రెస్, ముంబై ఎక్స్ ప్రెస్, గోవా, హజ్రత్ నిజముద్దిన్ రైళ్ల దారిని మళ్లించారు.

Related Articles

Latest Articles