ఆనందంతో తాలిబన్ల కాల్పులు.. పలువురు మృతి..

తాలిబన్లు అంటేనే చేతిలో గన్‌తో దర్శనమిస్తారు.. ఇక, వాళ్లకు కోపం వచ్చినా.. ఆనందం వచ్చినా.. గన్నులనే వాడేస్తారు.. ఆప్ఘన్‌ను రాజధాని కాబూల్‌ సహా అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు పంజ్‌షేర్‌ మాత్రం కొరకరాని కొయ్యగా మారింది.. అక్కడ యుద్ధం ఓవైపు.. చర్చలు మరోవైపు సాగుతున్నాయి.. అయితే, త్వరలోనే ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోన్న తాలిబన్లు.. పంజ్‌షేర్‌ కూడా తమ వశమైందని శుక్రవారం రోజు ఓ ప్రకటన చేశారు.. దీంతో.. తాలిబన్లు అంతా ఆనందోత్సాహాలతో సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.. నిన్న రాత్రి కాబూల్‌లోని పలు ప్రాంతాల్లో తాలిబన్లు పెద్దఎత్తున గాల్లోకి కాల్పులు జరిపారు.. ఈ కాల్పుల్లో చిన్నారులు సహా పలువురు మృతిచెందినట్టు తెలుస్తుండగా.. చాలా మంది గాయాలపాలైనట్టు ఓ ఆఫ్ఘనిస్తాన్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. గాయపడినవారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించాలని వెల్లడించింది. మరోవైపు.. పంజ్‌షేర్‌ ను కూడా ఆక్రమించుకున్నామంటూ తాలిబన్ల చేసిన ప్రకటనను నార్తర్న్ అల‌యెన్స్ బ‌ల‌గాలు ఖండించాయి. అది కానిపని అని చెప్పుకొచ్చాయి.. కానీ, తాలిబన్ల అరాచకాలకు ఆఫ్ఘన్ ప్రజలు బలి అవుతూనే ఉన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-