బ్రెజిల్‌లో దారుణం..పర్వతం కూలి ఏడుగురి మృతి

బ్రెజిల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెజిలియన్‌ సరస్సులో పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఒక్కసారిగా పర్వతం కొండ చరియలు విరిగిపడిపోవడంతో ఏడుగురు మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. శనివారం ఆగ్నేయ బ్రెజిల్‌లోనిమినాస్ గెరైస్ రాష్ట్రంలోని కాపిటోలియో వద్ద ఉన్న సరస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద పర్వతం లోయ గోడ ఒక్కసారిగా పడవలపై పడింది.

Read Also:వ్యవసాయంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలోఉంది: మంత్రి కన్నబాబు

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా ఈ ఘటనలో 20 మంది తప్పిపోయారని వారి కోసం డైవర్లతో సహా అగ్ని మాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారని అక్కడి అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. మరో 23 మంది స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి.


Related Articles

Latest Articles